నిజామాబాద్: కంటేశ్వర్ అండర్పాస్ వద్ద నిర్మాణ పనులు. - వాహనదారుల రాక,పోకలపై సిపి పలు సూచనలు.
- 45 రోజుల పాటు ఆంక్షలు.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: కంటేశ్వర్ రైల్వే అండర్పాస్ వద్ద నిర్మాణ పనులు వల్ల వాహనదారుల రాక, పోకలపై సిపి సాయిచైతన్య పలు సూచనలు చేశారు. ఈ నెల16 నుండి 45 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కంటేశ్వర్ రైల్వే అండర్పాస్ అనగా ఎన్టీఆర్ చౌరస్తా వైపు నుండి జెడ్పి చౌరస్తా మరియు కంటేశ్వర్ బైపాస్ వెళ్లే దారిలో ఒకవైపు గల రైల్వే అండర్పాస్ విస్తారణ పనులను దక్షిణ మధ్య రైల్వే డబుల్ ట్రాక్ వర్క్ చేపట్టడం మొదలు పెడుతున్నందున వాహనాలు వెళ్లడానికి మూసి వేయబడును, కావున వాహనదారులు ఈ క్రింద తెలుపబడిన మార్గాల గుండా తమ యొక్క ప్రయాణాలు సాగించాలి.
*1) నిజామాబాదు లోపలికి వచ్చే వాహనాలు :*
నిజామాబాదు పట్టణము లోపలికి వచ్చే వాహనాలు అనగా ఆర్మూర్ , నిర్మల్ , అదిలాబాద్ , కరీంనగర్ మరియు కామారెడ్డి , హైదరాబాద్ నుండి నిజామాబాద్ పట్టణంలో లోపలికి వచ్చే వాహనాలు నేరుగా పాత దారి వెంబటే అనగా, కంటేశ్వర్ బైపాస్, మీసేవ కంటేశ్వర్, ఒకవైపు పని పూర్తి అయిన రైల్వే అండర్ పాస్ గుండా ప్రయాణిస్తూ ఎన్టీఆర్ చౌరస్తా చేరుకొని అక్కడి నుండి కుడి చేతి వైపు తిరిగి రైల్వే స్టేషన్ ముందర నుంచి బస్టాండ్ చేరుకోవాలి.
2) అలాగే నిజామాబాద్ వైపు నుండి ఆర్మూరు, కరీంనగర్, అదిలాబాద్, నిర్మల్ మరియు కామారెడ్డి, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు* దేవీ రోడ్డు రైల్వే ఫ్లై ఓవర్ ని ఉపయోగించి దుబ్బ శివాజీ స్టాచ్యూ, దుబ్బ రోడ్ లో ప్రయాణిస్తూ దుబ్బా చౌరస్తా శ్రీ మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఎడమ చేతి వైపు మలిపి ఖానాపూర్ చౌరస్తా చేరుకోవచ్చు, అలాగే మహాలక్ష్మి టెంపుల్ దుబ్బ చౌరస్తా నుండి నేరుగా కూడా జిజి కాలేజ్ “యు” టర్న్ దాకా వెళ్లి బైపాస్ చేరుకోవచ్చు , బైపాస్ నుండి కంటేశ్వర్ డిఎస్ చౌరస్తా చేరుకోవచ్చు.
*3) ఇంతే కాకుండా హైదరాబాదు మరియు కామారెడ్డి వెళ్లే వాహనదారులు*
ఎన్టీఆర్ చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా నుండి మాధవ నగర్ రైల్వే గేట్ దాటుతూ మాధవ నగర్ బైపాస్ నుండి హైదరాబాద్ రోడ్డు చేరుకోవచ్చు.
*4) అలాగే బోధన్ , బాన్సువాడ మరియు వర్ని వెళ్లే వాహనాలు* యధావిధిగా పాత మార్గమునే అనుసరించి ప్రయాణం సాగించాలి. కావున నిజామాబాద్ నగర ప్రజలకు , ఈ రైల్వే అండర్పాస్ పని సుమారుగా (45) రోజులు జరిగే అవకాశం ఉన్నందున , పై తెలిపిన దారులను ఉపయోగించుకొని పట్టణంలోనికి రావడము మరియు పట్టణం నుండి బయటకు పోవడం కొనసాగించాలని సిపి సాయిచైతన్య సూచించారు.
*అత్యవసరంగా సంప్రదించ వలసిన కాంటాక్ట్ నంబర్లు*
నిజామాబాద్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్ 9959226022.
పోలీస్ కంట్రోల్ రూమ్ - 8712659700 మరియు ల్యాండ్ లైన్ 08462-226090, ఎస్ హెచ్ ఓ టాపిక్ పోలీస్ స్టేషన్ 8712659842.