10న విద్యాసంస్థల బంద్. విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 10 న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు (SFI -AISF-PDSU -AIFDS - PDSU -AIPSU సంఘాల నాయకులు పిలుపునిచ్చారు .నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ లో గురువారం నిర్వహించిన విలేఖర్ల స్జసమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా *పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, విద్యాశాఖ కి ఇప్పటివరకు మంత్రిని కేటాయించలేదని, 24 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదింపు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటు కార్పొరేట్...