ప్రభుత్వం 27000 పాఠశాలలను 4 వేలకు కుదించడం అశాస్త్రియం. - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పి ఆర్సి ని వెంటనే ప్రకటించాలి. - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్.

వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: ప్రభుత్వం 27000 పాఠశాలలను 4 వేలకు కుదించడం అశాస్త్రియం అని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పిఆర్సి ని వెంటనే ప్రకటించాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ (టిపిటిఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉపాధ్యా శిక్షణ లంచ్ అవరు లో సమావేశంలో నిర్వహించగా, అనిల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఖండించారు. కొత్త కొత్త పేర్లతో పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడం అనే అశాస్త్రియ విధానానికి...