వేముల వీరేశంకు మంత్రి హోదా... నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
వేగుచుక్క న్యూస్: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేముల వీరేశం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, నకిరేకల్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీల్లో ఒకదానితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వానికి నమ్మకంగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో...