డిల్లీలో.. విద్యార్థులపై దాడి అమానుషం. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి....పీడీఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ డిమాండ్. -
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్:డిల్లీలో.. విద్యార్థులపై దాడి అమానుషం అని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనీ, నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ పీడీఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం కోటగల్లిలోని నీలం రామచంద్రయ్య భవన్ లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్ మాట్లాడుతూ, 20 లక్షల మంది రాసిన నీట్ యూజీ పరీక్ష లీక్ కు గురి కావడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య...