నల్గొండలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు. - తెలంగాణ యూనివర్సిటీ లో కరపత్రాలు ఆవిష్కరణ.

వేగుచుక్క న్యూస్, డిచ్ పల్లి: నల్గొండలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగే పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నవదీప్, జ్ఞానేశ్వర్ లు అన్నారు. ఈ మేరకు మంగళవారం పి.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మానవీయ విలువలు పడిపోయి సంక్షోభంలో ఉందని, విద్యార్థులకు సామాజిక స్పృహ లేకపోవడం వల్ల అశ్లీల సాహిత్యం, గంజాయి మత్తు పదార్థాలకు అలవాటై ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. మరోవైపు పాలకుల విద్యారంగ వ్యతిరేక విధానాలతోని...