అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.

నిజామాబాద్‌, ఆగస్టు 25: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. నిజామాబాద్‌లో అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని...