అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత". - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
- నిజాం కాలేజీలో “వన్-డే సింపోజియం ఆన్ తెలంగాణ సోషియో-ఎకనామిక్ అనాలిసిస్” సదస్సు. *వేగుచుక్క న్యూస్,* *హైదరాబాద్, నిజాం కాలేజీ*: అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్యారంగంపై చర్చించేందుకు హైదరాబాద్లోని నిజాం కాలేజీలో “వన్-డే సింపోజియం ఆన్ తెలంగాణ సోషియో-ఎకనామిక్ అనాలిసిస్” సదస్సు మంగళవారం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం కాలేజీ...