పరిణామం చెందని "జర్నలిస్టు" బతుకులు..

- సమాజ మార్పు కోసం, నిజాయితీగా పనిచేస్తున్న "కలం వీరుల" సామాజిక కథనం.. *వేగుచుక్క న్యూస్ :* కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదేమో.. నిత్య నూతనంగా ఎప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది. మారకుండా ఉండిపోయిన తన జీవితాన్ని ఓసారి తడిమి చూసుకున్నాడు వెంకటేష్. నాలుగు దశాబ్దాలుగా సమాజంలో, మీడియా రంగంలో వస్తున్న మార్పులకు తానే ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డాడు. కరిగిపోయిన తన జీవితంలో కన్నీటి మాయమైన రోజులను తడిమి చూసుకుని, తనలో తానే ఓదార్చుకోవడం తప్ప ఎప్పుడూ ఎవరు భుజం తట్టిన దాఖలాలు లేవని మనసులో అనుకున్నాడు వెంకటేష్.ఆర్థికంగా అట్టడుగున మిగిలిపోయిన సమాజంలో మాత్రం సీనియర్ జర్నలిస్టుగా తెల్లచొక్కా వెనుక ఎన్నో విషాదపు నవ్వులను మోస్తూ...