సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. - పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.

- సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయిన వెంటనే 1930కు ఫోన్ చేయాలనీ వెల్లడి. - కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం. - పాల్గొన్న కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్. రజనికాంత్. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయిన వెంటనే 1930కు ఫోన్ చేయాలనీ సూచించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కాకతీయ ఇన్‌స్టిట్యూట్...