రాజంపేట ఏఈవో ఆత్మహత్య. - తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం.
వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: వ్యవసాయ శాఖలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో బుధవారం జరిగింది. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్యామ్ సుందర్ రెడ్డి(47) రాజంపేట ఏఈవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే ఉదయం ఫార్మ్ హౌస్ వద్దకు వెళ్లిన ఆయన, విధులకు వెళ్లే సమయం దాటినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫార్మ్ హౌస్ వద్దకు వెళ్లి చూశారు. అక్కడ ఓ గదిలో శ్యామ్ సుందర్ రెడ్డి ఉరేసుకుని ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు....