అభివృద్ధి పేరుతో.. "వీడీసీల అరాచకాలు ఉపేక్షించవద్దు.... - రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్."

- బహిష్కరణల జాడ్యాన్ని రూపుమాపేందుకు కఠినంగా వ్యవహరించాలి. - త్వరలోనే రాష్ట్రంలో బీ.సీ ప్రొటెక్షన్ యాక్టు అమలులోకి రానుందని వెల్లడి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, అక్టోబర్ 07 : అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతూ, అనాగరికంగా వ్యవహరించే గ్రామ అభివృధ్హి కమిటీల ఆగడాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ అధికారులకు స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా ఇంకనూ పలు గ్రామాలలో సామాజిక బహిష్కరణలు, జరిమానాల పేరుతో సామాన్య ప్రజానీకాన్ని వేధింపులకు గురి చేయడం శోచనీయమని అన్నారు. ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం...