"యాదన్న" యాదికొచ్చిండు. ---- (చారిత్రక కథనం.)
"జ్ఞానేశ్వర్‌ను సుమారు వంద కిలోమీటర్లు దూరం నుంచి లాక్కొచ్చింది ఎర్ర జెండా మీద అభిమానం.జ్ఞానేశ్వర్ అరవై వయసు లోపు వాడైన ఎన్నో చారిత్రక పరిణామాలను చూసిండు. జిల్లాల సరిహద్దులు దాటుకుని ఓ మారుమూల గ్రామానికి రావడం వెనుక సమాజాన్ని ప్రేమించిన తరం జ్ఞాపకాల గుర్తులను తడిమి చూసుకోవడం కోసం ఇంత దూరం వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక పరిస్థితులు తాను ఊహించినట్టు లేకపోవడంతో బాదనిపించింది జ్ఞానేశ్వర్‌కు." *వేగుచుక్క న్యూస్:* సనుగుల గ్రామంలోకి అడుగుపెడుతూనే కనిపించిన అల్లూరి సీతారామరాజు విగ్రహం గతాన్ని దోసిళ్లతో పట్టి చూపుతున్నట్టె అనిపించింది. ఒకనాడు ఉవ్వెత్తిన ఏగాసిపడిన ప్రజా పోరాటాకు కిష్టంపేట మర్రిగడ్డ, రామారావు పల్లి, సనుగుల, రుద్రంగితో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ...