పనుల్లో పురోగతి సాధించాలి..ఆర్ అండ్ బీ అధికారులతో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్ష...
ఖిల్లా రామాలయం పై రోప్ వే డీపీఆర్ సిద్ధం చేయాలనీ సూచించారు. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నియోజకవర్గానికి సంబంధించి ఆర్అండ్బీ పనుల్లో పురోగతి సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇందూరులో చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయ అభివృద్ధి కొరకు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా స్పందించిన ప్రభుత్వాలు రోప్ వే కొరకు డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించింది అన్నారు. ఇటీవల ఆర్ అండ్ బి అధికారులతో పాటు రోప్ వే నిర్మాణ కంపెనీ...