"సత్యశోధక్ " పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. - గత స్మృతులు పంచుకున్న 2012-13 ఎస్ఎస్ సి విద్యార్థులు.
- పాఠశాల విద్య, క్రమశిక్షణ, విలువలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు* - ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య. వేగుచుక్క న్యూస్, సిరికొండ: సత్యశోధక్ పాఠశాలలో 2012-13 విద్యా సంవత్సరంలో పదో తరగతి (ఎస్.ఎస్.సి.) పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం సిరికొండలోని ఎం.ఎన్. ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారి సమక్షంలో వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. సుమారు 13 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పాత స్నేహాలను గుర్తు చేసుకుంటూ సందడిగా గడిపారు. విద్యార్థి దశలో కలిసి చదువుకున్న మిత్రులు నేడు వివిధ...