EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ స్థాయి ఛాంపియన్లుగా "సత్యశోధక్" విద్యార్థులు. - అభినందించిన ఎంపీ ధర్మపురి అరవింద్.

    Author admin | 03 Jul 2026, 12:53 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    జాతీయ స్థాయి ఛాంపియన్లుగా "సత్యశోధక్" విద్యార్థులు.  - అభినందించిన ఎంపీ ధర్మపురి అరవింద్.

    వేగుచుక్క న్యూస్, సిరికొండ:
    విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో చదువుతూ జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికకావడం అభినందనీయమని, విజ్ఞానం, విలువలను పెంపొందించుకొంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. గురువారం తన కార్యాలయంలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థులు వి. సాద్వి, కె. రుగ్వేదా, జి. అద్వైత్ రెడ్డి లు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఛాంపియన్స్ గా నిలిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనందున ఎం. పి. అరవింద్ తన చేతుల మీదుగా అవార్డులు, సర్టిఫికెట్లు  మరియు నగదు ప్రోత్సాహాన్ని అందజేసి విద్యార్థులను అభినందించారు.  విద్యార్థులు ఇలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య, ఉపాధ్యాయులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.