EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రైవేట్ పాఠశాలల రక్షణకు కఠిన చట్టాలు తేవాలి. - నిజామాబాద్ సీపీకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వినతి.

    Author admin | 26 Aug 2026, 06:11 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    ప్రైవేట్ పాఠశాలల రక్షణకు కఠిన చట్టాలు తేవాలి.  - నిజామాబాద్ సీపీకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వినతి.

    *వేగుచుక్క న్యూస్,*
    *ఆర్మూర్, ఆగస్టు 26:* ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు కఠిన చట్టాలు తేవాలనీ ట్రస్మ, ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇటీవల నల్గొండలో జరిగిన రూపారెడ్డి హత్యను వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల రక్షణ కోసం కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
    అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు చట్టాలపై, ప్రవర్తన, క్రమశిక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

    *సిపి సాయిచైతన్య కు అభినందనలు.*

    అనంతరం భారతదేశంలోని అత్యుత్తమ చీఫ్ అధికారుల జాబితాలో చోటు సంపాదించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యా ప్రవీణ్ పవార్, ట్రస్మ జిల్లా అధ్యక్షులు శ్రీ భాషిత సుందర్, మండల సెక్రటరీ నలంద ప్రసాద్, కోశాధికారి స్కాలర్స్ వేణు, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి