EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి." - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి. - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.

    Author admin | 25 Aug 2026, 06:07 PM | Sports, TELANGANA
    క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి."  - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి.  - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.

    - హాజరైన తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి ) అబ్జర్వర్ ప్రణతి.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు క్రీడల్లో రాణించి తమ ప్రతిభతో "దేశానికి మంచిపేరు తేవాలనీ ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని ప్రెసిడెన్సీ స్కూల్‌లో ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ సెపక్‌తక్రా టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రెసిడెన్సీ స్కూల్, గిరిరాజ్ స్కూల్‌కు చెందిన జూనియర్ విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి ) అబ్జర్వర్ ప్రణతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి మాట్లాడుతూ, 2036 ఒలింపిక్ గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అస్మిత కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభను పెంపొందించుకుని భవిష్యత్తులో భారతదేశం తరఫున ఆడి దేశానికి మంచి పేరు, ప్రతిష్ఠ తీసుకురావాలని ఆకాంక్షించారు.

    క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి."  - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి.  - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.   - Additional Image

    *తెలంగాణ సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,*

    ఇవి కూడా చదవండి

    ప్రెసిడెన్సీ స్కూల్‌లో ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ సెపక్‌తక్రా పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యం, సెపక్‌తక్రా అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.

    క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి."  - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి.  - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.   - Additional Image

    *విజేతలు*
    ప్రథమ బహుమతి: గిరిరాజ్ కళాశాల
    ద్వితీయ బహుమతి: ప్రెసిడెన్సీ హై స్కూల్
    తృతీయ బహుమతి: ప్రెసిడెన్సీ స్కూల్.

    విజేతలకు ముఖ్య అతిథులు శమంతా రెడ్డి, సాయి అబ్జర్వర్ ప్రణతి, ఆర్. శ్రీనివాస్ రెడ్డి , జి. సంజీవ రెడ్డి, భాగారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి. సంజీవ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాగారెడ్డి, ఇంటర్నేషనల్ ప్లేయర్ దీపిక, సురేష్, రాజిత, వ్యాయమ ఉపాధ్యాయులు శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి