EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్గొండలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు. - తెలంగాణ యూనివర్సిటీ లో కరపత్రాలు ఆవిష్కరణ.

    Author admin | 25 Aug 2026, 06:27 PM | TELANGANA
    నల్గొండలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు.  - తెలంగాణ యూనివర్సిటీ లో కరపత్రాలు ఆవిష్కరణ.

    వేగుచుక్క న్యూస్, డిచ్ పల్లి: నల్గొండలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగే పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నవదీప్, జ్ఞానేశ్వర్ లు అన్నారు. ఈ మేరకు మంగళవారం పి.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మానవీయ విలువలు పడిపోయి సంక్షోభంలో ఉందని, విద్యార్థులకు సామాజిక స్పృహ లేకపోవడం వల్ల అశ్లీల సాహిత్యం, గంజాయి మత్తు పదార్థాలకు అలవాటై ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. మరోవైపు పాలకుల విద్యారంగ వ్యతిరేక విధానాలతోని విద్య సరుకుగా మారుతుందని అన్నారు. పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి నేడు లేదన్నారు. లక్షల రూపాయలు చెల్లిస్తేనే చదువు దొరికే దుస్థితి నెలకొంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా కార్పొరేటీకరణకు పాల్పడుతుందన్నారు. పేపర్ లీకేజీ అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు విరోచిత పోరాటం వల్లనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందనీ అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమాలు వెల్లువ లాగా వస్తున్నాయని అన్నారు.
    రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ న్స్ స్కాలర్షిప్ లను విడుదల చేయలేదన్నారు. యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను అన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సామాజిక స్పృహ అందించడానికి, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి ఉద్యమాలకు సన్నద్ధం చేయడానికి రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డీ.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,జిల్లా నాయకులు మనోజ్,పవన్, తే.యూ పిడిఎస్ యూ నాయకులు నితిన్, మణిదీప్, శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీకాంత్, సిద్దార్థ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి