EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత". - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

    Author admin | 06 Oct 2026, 09:49 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత".  - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

    - నిజాం కాలేజీలో “వన్-డే సింపోజియం ఆన్ తెలంగాణ సోషియో-ఎకనామిక్ అనాలిసిస్” సదస్సు.

    *వేగుచుక్క న్యూస్,*
    *హైదరాబాద్, నిజాం కాలేజీ*: అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్యారంగంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో “వన్-డే సింపోజియం ఆన్ తెలంగాణ సోషియో-ఎకనామిక్ అనాలిసిస్” సదస్సు మంగళవారం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా నిజాం కాలేజీ యాజమాన్యం, ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సదస్సును ఉద్దేశించి ప్రారంభ..ఉపన్యాసం చేశారు.

    అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత".  - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. - Additional Image

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్రానికి మిగులు బడ్జెట్‌తో కూడిన ఆర్థిక పరిస్థితులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, నాటి ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేయలేకపోయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఫలాలు అందించే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. తెలంగాణ సామాజిక-ఆర్థిక పరిస్థితులపై విద్యార్థులు అధ్యయనం చేయడం, వాస్తవ పరిస్థితులను విశ్లేషించడం అభినందనీయమని అన్నారు. సమాజం, ఆర్థిక వ్యవస్థ, విద్య, అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు లోతైన అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే ఇటువంటి సదస్సులు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

    అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత".  - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. - Additional Image

    *ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. ఏ. మాలిక్, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్,*

    “ఆర్థిక సమస్యల సామాజిక– ఆర్థిక విశ్లేషణ ప్రాముఖ్యత” అనే అంశంపై ప్రసంగించారు. ఆర్థిక సమస్యలను కేవలం ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ధరలు, వృద్ధిరేట్లు వంటి గణాంకాల ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవడం పరిపూర్ణం కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల వెనుక ఉన్న సామాజిక వాస్తవాలను, సామాజిక నిర్మాణాన్ని, కులం, లింగం, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలను అర్థం చేసుకున్నప్పుడే ఆర్థిక సమస్యల స్వభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ , ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    అభివృద్ధి, సంక్షేమానికి.. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత".  - ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. - Additional Image
    అత్యధికంగా చదివినవి