EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పనుల్లో పురోగతి సాధించాలి..ఆర్ అండ్ బీ అధికారులతో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్ష...

    Author admin | 13 Oct 2026, 08:07 PM | TELANGANA
    పనుల్లో పురోగతి సాధించాలి..ఆర్ అండ్ బీ అధికారులతో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్ష...

    ఖిల్లా రామాలయం పై రోప్ వే డీపీఆర్ సిద్ధం చేయాలనీ సూచించారు.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నియోజకవర్గానికి సంబంధించి ఆర్అండ్బీ పనుల్లో పురోగతి సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇందూరులో చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయ అభివృద్ధి కొరకు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా స్పందించిన ప్రభుత్వాలు రోప్ వే కొరకు డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించింది అన్నారు. ఇటీవల ఆర్ అండ్ బి అధికారులతో పాటు రోప్ వే నిర్మాణ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారని గుర్తు చేశారు. ప్రధానంగా నగరంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాత పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

    పనుల్లో పురోగతి సాధించాలి..ఆర్ అండ్ బీ అధికారులతో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్ష... - Additional Image

    అంతకుముందు పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో కొనసాగుతున్న యూజీడీ, టీయూఎఫ్ఐడీసీ 60 కోట్ల పనుల పురోగతిపై చర్చించారు. ప్రధానంగా యు జి డి పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనిపై అధికారులకు తగు సూచనలు అందజేశారు. గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ డీఈ లు నాందేవ్, రామ్మోహన్, ఏఈ సాయి కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ యోగేష్, ఏఈ శివకృష్ణ, యూజీడీ వర్క్స్ మేనేజర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి