EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "సత్యశోధక్ " పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. - గత స్మృతులు పంచుకున్న 2012-13 ఎస్ఎస్ సి విద్యార్థులు.

    Author admin | 21 Oct 2026, 07:46 PM | TELANGANA
    "సత్యశోధక్ " పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.  - గత స్మృతులు పంచుకున్న 2012-13 ఎస్ఎస్ సి విద్యార్థులు.

    - పాఠశాల విద్య, క్రమశిక్షణ, విలువలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు*

    - ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య.

    వేగుచుక్క న్యూస్, సిరికొండ:
    సత్యశోధక్ పాఠశాలలో 2012-13 విద్యా సంవత్సరంలో పదో తరగతి (ఎస్.ఎస్.సి.) పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం సిరికొండలోని ఎం.ఎన్. ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారి సమక్షంలో వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. సుమారు 13 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పాత స్నేహాలను గుర్తు చేసుకుంటూ సందడిగా గడిపారు. విద్యార్థి దశలో కలిసి చదువుకున్న మిత్రులు నేడు వివిధ రంగాల్లో స్థిరపడి, తమ జీవిత ప్రయాణంలోని అనుభవాలను పరస్పరం పంచుకోవడం ఈ సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ఇవి కూడా చదవండి

    *ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ,*

    2012-13 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులను ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకోవడం ఎంతో ఆనందంగా, మరపురాని అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. పాఠశాలలో నేర్చుకున్న విద్య, క్రమశిక్షణ, విలువలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని అన్నారు. పాఠశాల యూనిఫాం విడిచిపెట్టి, జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ఎదిగినా, పాఠశాలతో, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదని భావోద్వేగంగా వివరించారు.

    పాఠశాల జీవితంలోని స్నేహాలు, ఆత్మీయతలు, మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. 13 ఏళ్ల జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయాలు, కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య స్నేహబంధాలు మరింత బలపడతాయని, పాఠశాల దశలో ఏర్పడే స్వార్థరహిత స్నేహం ఎంతో విలువైనదని, అలాంటి అనుబంధాలను జీవితాంతం కాపాడుకోవాలని సూచించారు.

    ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్యతో పాటు పదో తరగతి బోధించిన ఉపాధ్యాయులు గంగారెడ్డి, సంతోష్ రెడ్డి, లింగం, నరేందర్, మైఖేల్, ప్రసాద్, అరుణ, సుజాతలను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు సైతం తమ పూర్వ విద్యార్థులను తిరిగి కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వారంతా జీవితంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

    అత్యధికంగా చదివినవి